
వైఎస్సార్‌సీపీ నాయకులతో మాట్లాడుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాబూరావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్‌నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చిర్ల జగ్గిరెడ్డి, విశ్వాసరాయ కళావతి, బుట్టా రేణుక, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, శోభా హైమావతి, వంగా గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, ఎల్ అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
