తాడేపల్లి :రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈనెల 5వ తేదీన తలపెట్టే ఫీజుపోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది వైఎస్సార్‌సీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి కోరుతూ ఈసీకి వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది.
ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫీజు పోరు కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. సుమారు రూ. 3,900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపోరుకు పిలుపునిచ్చింది వైఎస్సార్‌సీపీ. ఆ రోజు ఉదయం 10:30 నుండి ఒంటి గంట వరకు కలెక్టరేట్ల వద్ద ఫీజు పోరు కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ చేపట్టనున్నట్లు.. ఆ మేరకు అనుమతి కోరుతూ పార్టీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి లేఖ రాశారు,.
Comments
Please login to add a commentAdd a comment