గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం... తెలుగు కుటుంబం దుర్మరణం | Telugu Family Died In Road Accident At Saudi Arabia, Details Inside - Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదం... తెలుగు కుటుంబం దుర్మరణం

Published Sat, Aug 26 2023 1:38 AM | Last Updated on Sat, Aug 26 2023 9:45 AM

గౌస్‌బాషా కుటుంబం (ఫైల్‌)  - Sakshi

గౌస్‌బాషా కుటుంబం (ఫైల్‌)

బెంగళూరులో స్థిరపడిన ఓ కుటుంబం సౌదీ అరేబియా నుంచి కువైట్‌కు వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని మృత్యువాత పడింది.

అన్నమయ్య: బెంగళూరులో స్థిరపడిన ఓ కుటుంబం సౌదీ అరేబియా నుంచి కువైట్‌కు వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో గౌస్‌బాషా అనే యువకుడు, ఆయన భార్యాపిల్లలు దుర్మరణం చెందారు.

ఈ సంఘటన గురువారం జరిగినట్లు రాజంపేటలోని వారి సంబంధీకులు తెలిపారు. రాజంపేట పట్టణంలోని పెద్దమసీదు మాజీ ప్రెసిడెంట్‌ దివంగత నూరుద్దీన్‌ బావమరిది కొడుకై న గౌస్‌బాషా గతంలో పదవ తరగతి వరకు అక్కడే చదివాడు. చాలా ఏళ్ల క్రితమే వారి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. గౌస్‌బాషా ఉపాధి నిమిత్తం కువైట్‌ దేశంలో ఉంటున్నాడు.

ఎంబసీ నుంచి పోలీసులకు సమాచారం
కువైట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి పాస్‌పోర్టు ఆధారంగా వివరాలను రాబట్టేందుకు ఎంబసీ అధికారులు రాజంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ చైతన్య మృతి చెందిన వారి వివరాల కోసం ఆరా తీశారు. గౌస్‌బాషా సంబంధీకులు కొందరు ఇక్కడే ఉండటం వల్ల చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement