కట్టుకున్న భార్యను కడతేర్చాడు | - | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భార్యను కడతేర్చాడు

Published Mon, Mar 18 2024 1:10 AM | Last Updated on Mon, Mar 18 2024 8:18 AM

- - Sakshi

లక్కిరెడ్డిపల్లి : భర్తే కాలయముడిగా మారి కట్టుకున్న భార్యను చున్నీతో గొంతు నులిమి హత్యచేసిన సంఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతల గ్రామం బొమ్మేపల్లెలో చోటు చేసుకుంది. సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు కథనం మేరకు.. రమణమ్మ(32)ను యోగానందరెడ్డి ఎనిమిదేళ్ల క్రితం వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం, నల్లయ్యగారిపల్లెలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పథకం ప్రకారం యోగానందరెడ్డి చున్నీతో రమణమ్మ గొంతు నులిమి హత్య చేశాడు.

నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తన భార్యను హత్యచేశానని చెప్పాడు. దీంతో వెంటనే సీఐ జీవన్‌ గంగనాథ్‌ బాబు, ఎస్‌ఐ విష్ణువర్దన్‌లు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌తో పరిశీలించారు. పోస్టుమార్టం కోసం రమణమ్మ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement