
పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి
రాయచోటి అర్బన్ : పీజీ కామన్ సెట్ విధానంతో పాటు జీఓ నంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలకు గండికొడుతున్న జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్, నియోజకవర్గ నాయకులు కిరణ్‌కుమార్, గణేష్, లక్ష్మిప్రసాద్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment