సాక్షి, రాయచోటి : ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగో లేదని..బ్రతిమాలినా వదల్లేదు..ఆయనను అదుపులోకి తీసుకున్న రోజునుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఎక్కడో ఓ చోటికి తీసుకు వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సోమవారం పోసానిని పీటీ వారెంట్‌పై నరసరావుపేటకు తీసుకెళ్లేందుకు పోలీసులు రాజంపేట సబ్ జైలు వద్దకు వచ్చారు. జైలు అధికారులు పోసానికి విషయం చేరవేయగా..ఆరోగ్యం బాగాలేదని, వెళ్లలేనని చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పోలీసులు ఆరోగ్యం విషయంలో సమస్య లేకున్నా నటిస్తున్నాడంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పీటీ వారెంటుపై సోమవారం ఉదయాన్నే పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లారు.
వేధించడమే లక్ష్యం
పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తల ద్వారా ఫిర్యాదులు చేయించి కేసులు నమోదు అయ్యేలా చేశారు. రాయలసీమతోపాటు పలు జిల్లాల్లో సుమారు 14–16 కేసుల వరకు పోసానిపై నమోదు చేశారు. గతనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసానిని అదుపులోకి తీసుకున్న తర్వాత 27వ తేదీ కోర్టులో హాజరు పరిచారు. అక్కడ బెయిలు వస్తుందేమోనన్న అనుమానంతో ఇతర జిల్లాకు చెందిన పోలీసులు కూడా మకాం వేసి ఆయనను అదుపులోకి తీసుకోవాలని బయట వేచి ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్‌జైలుకు తరలించాల్సి వచ్చింది. ఈ తరుణంలో పీటీ వారెంట్ పేరుతో పలు జిల్లాలకు సంబంధించిన పోలీసులు వరుసగా రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసులు నమోదైన తరుణంలో పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి హాజరు పెట్టనున్నారు. దీంతో వరుసగా తిప్పడంతోపాటు కేసుల పేరుతో పోసానిని వేధించడమే లక్ష్యంగా సర్కార్ ఎత్తుగడలుగా కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
హార్ట్ సమస్య ఉన్నా....
పోసాని కృష్ణమురళికి గతంలోనే గుండెకు సంబంధించి స్టంట్ వేశారు. ఇలాంటి తరుణంలో పోలీసులు దూర ప్రయాణం చేసే సమయంలో కనీసం వైద్యుడినైనా అందుబాటులో ఉంచుకోవాలి. అంబులెన్స్ లేకపోగా...వైద్యుడు లేకపోతే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పోసాని కృష్ణమురళిని వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో
పోసానిపై కేసులు
Comments
Please login to add a commentAdd a comment