ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతం
రాయచోటి/మదనపల్లె సిటీ : ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 13201 మంది విద్యార్థులకు 12638 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు తగిన మౌలిక వసతులు కూడా కల్పించామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం కృష్ణయ్య తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు
మదనపల్లె పట్ణణంలోని ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీస సౌకర్యాలు లేవని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌కు వినతిపత్రం అందజేశారు. నారాయణ కాలేజీలో ఒక బిల్డింగ్‌లో రెండు పరీక్షా కేంద్రాలు ఇచ్చారన్నారు. బెంగుళూరురోడ్డులోని ప్రైవేటు కాలేజీలో కనీసం మౌలిక వసతులు లేవన్నారు. కదిరిరోడ్డులోని ప్రైవేటు కాలేజీ వద్ద వ్యాపార సముదాయాలు ఉన్నాయన్నారు. ప్రశాంత్‌నగర్‌లోని ప్రైవేటు కాలేజీలో గదుల్లో సరైన వెలుతురు లేదన్నారు. పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో లేరన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, నాయకులు ఆఫ్రిద్, జయబాబు, సమీర్, ప్రేమ్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment