ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
రాజంపేట టౌన్ : జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రాయచోటిలో నాలుగు, రాజంపేటలో మూడు, మదనపల్లెలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తొలిరోజు జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 1,878 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,676 మంది హాజరయ్యారని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ ఇద్దరు చొప్పున సిట్టింగ్ స్క్వాడ్‌ను, అలాగే మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
గృహ విద్యుత్ అదనపు లోడు క్రమబద్ధీకరణకు రాయితీ
రాయచోటి జగదాంబసెంటర్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఆర్‌ఈసీ) తక్కువ లోడ్‌తో విద్యుత్ కనెక్షన్ తీసుకొని ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులకు అదనపు లోడును 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది.ఈ అవకాశాన్ని రాయచోటి డివిజన్ పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరూరి యుగంధర్ తెలిపారు. సోమవారం రాయచోటిలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు తమ ఇళ్లకు అడిషనల్ లోడ్ 50 శాతం రాయితీకి ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీలోపు మీ సర్వీస్ నంబర్, మీ ఆధార్‌కార్డు తీసుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
బాలికలకు చట్టాలపై
అవగాహన తప్పనిసరి
రాయచోటి అర్బన్ : బాలికలకు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ సాధితకారత అధికారిణి పి.రమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నతపాఠశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు మహిళా ఉద్యోగులు బైక్‌ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పఢావో కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా బాలికలకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికావిద్యను ప్రోత్సహించడం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కిషోరబాలికల వికాసం కార్యక్రమాల్లో భాగంగా అంగన్‌వాడీ సెంటర్ పరిధిలో డ్రాపౌ ట్స్‌ని గుర్తించి 10 నుంచి 15 మందికి మించకుండా సఖి సమూహాలను మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కూడా సఖి సమూహాలను ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహనను కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థల హెచ్‌ఓడీలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment