సాక్షి, రాయచోటి : ప్రజాక్షేత్రంలో పట్టున్న నేతగా నిరూపించుకున్న ఆకేపాటిపై ఆడని అబద్ధాలు లేవు. పచ్చ పత్రికలకు లీకులు ఇస్తూ ఏదో ఒక రకంగా అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. 100 ఎకరాలు..కాదు కాదు...200 ఎకరాలు..కాదు 300 ఎకరాలు ఆక్రమించారంటూ ఇష్టానుసారంగా ఫిర్యాదులు చేస్తూ మానసికంగా కుంగిపోయేలా వ్యూహం అమలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆకేపాటిని సర్కార్ టార్గెట్ చేసింది. భూములే కాదు..ఇతర సమస్యలు కూడా దరిచేరకుండా ఉండాలంటే పార్టీ మారడమే మీ ముందన్న లక్ష్యం అన్నట్లు ఆకేపాటి కుటుంబంపై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆది నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆకేపాటి అన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఆకేపాటి కుటుంబంపై కుట్రలు
వైఎస్సార్ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డితోపాటు ఆయన కుటుంబంపై కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ మంచి మనిషిగా గుర్తింపు పొందిన ఆకేపాటి అమర్‌నాథరెడ్డిని పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి వైఎస్సార్ సీపీని అన్ని విధాలుగా బలోపేతం దిశగా తీసుకెళుతూ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆకేపాటి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కూటమి సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తున్నారు. అధికారుల తీరుపై కూడా ఉదాసీన వైఖరి కాకుండా బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకేపాటిని అభాసుపాలు చేయాలన్న దురుద్దేశంతో అధికారుల ద్వారా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆయన ఇంటిని అక్రమంగా నిర్మించుకున్నారని,భూములను ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని ఫిర్యాదులతో నాటకాన్ని రక్తికట్టించారు. ఆకేపాటిపై భూముల విషయంలో ఒకవైపు సోషల్‌మీడియాలోనూ, మరోవైపు ఫిర్యాదుల ద్వారా...ఇంకోవైపు పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మారు. వందల ఎకరాలు ఆక్రమించారంటూ ఇష్టానుసారంగా కథలు అల్లారు. అయితే జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో ఉన్న 36 ఎకరాలు తొలగించడం, రిజిస్ట్రేషన్లు రద్దు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆకేపాటి కుటుంబం న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆకేపాటి సైలెంట్‌గానే ఆరోపణలకు దీటుగా తగిన సాక్ష్యాలతో ధీటుగా సమాధానమిస్తున్నారు.
ఆకేపాడు భూములపై హైకోర్టు స్టేటస్ కో
అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని ఆకేపాడు భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. సుమారు 36 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఆకేపాటి కుటుంబ సభ్యుల పేర్లు రికార్డుల నుంచి తొలగించడం, రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంపై ఆకేపాటి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా సుమారు 30 ఏళ్లకు పైగా తమ ఆధీనంలో ఉన్నట్లు కోర్టుకు వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ అనుభవంలో భూమి ఉందన్నారు. ఇప్పుడు ఫిర్యాదులంటూ రికార్డుల్లో చెరిపి వేయడం ఏమిటని ఆకేపాటి న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. ఇష్టానుసారంగా వందల ఎకరాలు ఆక్రమించారంటూ విష ప్రచారం చేశారని కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ఆకేపాటి భూములకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో....ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భూమిపై స్టేటస్‌కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనుభవంలో ఉన్న భూమికి
సంబంధించి కోర్టుకు ఆధారాలు
100, 200 ఎకరాలు
ఆక్రమించారంటూ విష ప్రచారం
మానసికంగా ఆకేపాటిని
దెబ్బతీయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment