కిటకిటలాడిన గంగమ్మ ఆలయం
లక్కిరెడ్డిపల్లె.. మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన అనంతపురం గంగమ్మ దేవాలయం జాతర ముగిసిన మరుసటి రోజు సోమవారం కూడా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్కిరెడ్డిపల్లె సీఐ, ఎస్‌ఐలు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారులైన చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్‌లు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మార్కండేయ, శ్రీరాములు ,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గంగమ్మ దేవత హుండీ ఆదాయం రూ.15 లక్షలు
ఈ నెల 1, 2, 3 తేదీల్లో జరిగిన మూడు రోజుల గంగమ్మ దేవత జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించారు. రూ.15లక్షల 43 వేలు 302 నగదు, బంగారం రూపంలో 11 గ్రాములు, వెండి రూపంలో 1 కేజీ 928 గ్రాములు వచ్చినట్లు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు చెల్ల గంగరాజు, దినేష్ యాదవ్, చంద్ర, వెంకటేశ్వర్లు, రెడ్డిశేఖర, కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కిటకిటలాడిన గంగమ్మ ఆలయం
Comments
Please login to add a commentAdd a comment