భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం

Published Tue, Mar 4 2025 2:36 AM | Last Updated on Tue, Mar 4 2025 2:35 AM

భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం

భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం

రాయచోటి టౌన్‌ : రాయచోటిలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి వారి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం మఠాధిపతి వేదపండితులు శ్రీ మఠం ఓంకార స్వామి శిష్యగణం ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అంతకు ముందు హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి వారి బ్రహ్మోత్సవాల కంకణధారణలు విసర్జింప జేశారు. తర్వాత వసంతోత్సవ కార్యక్రమం అత్యంత కోలాహలంగా చేపట్టారు. ఈ పూజలు ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్‌ స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement