కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలి
బి.కొత్తకోట : పార్టీ కోసం కష్టపడిన తమకే పదవులన్నీ కట్ట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు డిమాండ్ చేశారు. సోమవారం బి.కొత్తకోటలో సమావేశమైన వీరంతా అధికారిక పదవులపై చర్చించారు. ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వర్గానికి పదవులు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడింది తామేనని, పదవులు శంకర్ వర్గానికి ఇవ్వడమే న్యాయమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ జోన్ ఫోర్ ఇన్‌చార్జ్ దీపక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నివేదిక ఇవ్వాలని కోరినట్టు శంకర్ వర్గీయులు తెలిపారు. శంకర్ ఆదేశాలతోనే ఈ సమావేశం నిర్వహించామని నాయకులు చెప్పడం గమనార్హం. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న వర్గ పోరు మళ్లీ బహిరంగమై పోటాపోటీగా సమావేశాలు పెడుతున్నారు.ఈ పోటీ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు నారాయణస్వామి రెడ్డి, పోల్ కోఆర్డినేటర్ కుడుము శ్రీనివాసులు, టౌన్ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, క్లస్టర్ ఇన్చార్జి కనకంటి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుకుమార్, ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్ పాల్గొన్నారు.
జయచంద్రారెడ్డికి పోటీగా
శంకర్ వర్గం సమావేశం
Comments
Please login to add a commentAdd a comment