వీఆర్వో రూటే సపరేటు
గాలివీడు : స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓ ద్వితీయశ్రేణి అధికారి వీఆర్వో లంచావతారం ఎత్తాడు. ఆయన లీలలు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వ భూముల్లో ఒకో డీ పట్టాను రూ.50 వేలకు వేలం వేసి మరీ విక్రయించడం గమనార్హం. పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములైనా,పట్టా భూములైనా ఇతరులకు ఆన్లైన్ చేయించేస్తాడు. రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నా తప్పనిసరి బదిలీల్లో సైతం చక్రం తిప్పి మండలంలో తిష్ట వేశాడు. అసైన్డ్ భూముల్లో అవినీతి,పొజిషన్ సర్టిఫికెట్ల పేరుతో విక్రయాలు,ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి రైతుల దగ్గర నుండి డబ్బులు గుంజడం, ఇలా ఒకటేమిటి అన్నీ అక్రమాలే జరుగుతున్నాయంటూ ప్రజలు నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గాలివీడు వీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన పక్కనున్న గోరాన్ చెరువు గ్రామంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటంతో అక్కడికి మకాం మార్చాడు. ప్రభుత్వ భూములు స్వాహాలో కొన్ని గమనిస్తే గాలివీడు పరిధిలో గుర్రాలమిట్ట వద్ద సర్వే నంబర్ 2286 లో 70 సెంట్ల భూముని మాయం చెయ్యగా, రాయచోటి ప్రధాన రహదారి పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద సర్వే నంబర్ 900బీ1 లోని 85 సెంట్ల భూమిలో మామూళ్లకు కకత్తి పడి 40 సెంట్లు భూమిని వేరొకరి పేరుపై అన్లైన్ చేయించేశాడు. అలాగే రాయచోటి కదిరి ప్రధాన రహదారి పక్కనే ఉన్న విలువైన పట్టా భూమిని వేరొకరి పేరుపై ఆన్‌లైన్ చేయించాడు. గోరాన్ చెరువు గ్రామంలో మూడు యకరాల వ్యవసాయ భూమి వేరొకరి పెరోపై ఆన్‌లైన్ చేసయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ పరంగా మండలంలో ఏపని చేయాలన్నా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే పని జరగదు. డబ్బు ముట్టనిదే ఆయన ఏ పనీ చేయరన్న ఆరోపణలు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. డీ పట్టాలు కొన్నవారి పేర్లను సైతం రికార్డుల్లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అనుకుంటే రికార్డులను సైతం తారుమారు చేస్తాడన్న విమర్శిలున్నాయి. మండలానికి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని వారి ద్వారా ప్రభుత్వ భూములను సైతం ఆన్‌లైన్ లోకి ఎక్కిస్తానంటూ వాటికి ఆనుకుని ఉన్న రైతులకు సమాచారం ఇచ్చి ముడుపులు దన్నుకుంటున్నాడని తెలుస్తోంది.ఇ ప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఇలాంటి అవినీతి తిమింగళాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఒక్కో డీ పట్టా రూ.50 వేలు
ప్రభుత్వ భూములను
మాయం చేస్తున్న ఘనుడు
తప్పనిసరి బదిలీల్లో కూడా
మండలాన్ని వదలని విక్రమార్కుడు
Comments
Please login to add a commentAdd a comment