పౌల్ట్రీ ఫారం మూసివేత
గాలివీడు : హైకోర్టు ఆదేశాలతో గ్రామసభ తీర్మానం మేరకు శ్రీ షిరిడీ సాయి పౌల్ట్రీ ఫారాన్ని ఆదివారం మూసివేసినట్లు గోరాన్‌చెరువు పంచాయతీ కార్యదర్శి సరోజమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తుల విన్నపం మేరకు ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. గోరాన్ చెరువు గ్రామం దాసరివాండ్లపల్లెలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫారం ద్వారా వెలువడే వ్యర్థాలు, దుర్వాసనతో స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారన్న కారణంగా కోళ్ల ఫారాన్ని మూసివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్‌టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మికర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ప్రొద్దుటూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికకు సంబందించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్‌ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్‌బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్‌సెక్రటరీగా టి.విజయ్‌కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్‌గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడపలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికై న 11 మందిని పలువురు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది సత్కరించారు.
పౌల్ట్రీ ఫారం మూసివేత
Comments
Please login to add a commentAdd a comment