● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
గుర్రంకొండ మండల పరిధి తరిగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం ఉదయాన్నే మూలవర్లకు శుద్ధితోమాల సేవ నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారికి అలంకరణ కావించారు. ఈ సందర్భంగా తిరుచ్చి ఉత్సవం గ్రామ వీధుల మీదుగా మేళతాళాలతో, జానపద కళాకారుల భజనలతో కనుల పండువగా నిర్వహించారు. అనంతరం స్నపన తిరమంజనం కావించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు పెద్దశేషవాహనంపై కొలువుదీరి గ్రామ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
– గుర్రంకొండ
● గంగమ్మ ఆలయం.. పోటెత్తిన భక్తజనం
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తికుని వేలాది మంది భక్తులు ఆదివారం మొక్కులు తీర్చుకున్నారు. జాతర ముగిసిన తరువాత మొదటి ఆదివారం కావడంతో ఇటు గ్రామంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్‌లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. ఆలయ పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్, రామచంద్ర, వెంకటేష్, గురుస్వామి, రెడ్డిశేఖర్,బోస్ యాదవ్, సాయిలు తీర్థప్రసాదాలు అందజేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులతోపాటు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. జాతర సందర్భంగా ఏర్పాట్లు చేసిన శీతల పానియాలు, దుకాణాలు, మిఠాయి కొట్టులు, చెరుకుల బండ్లు ఇంకా ఉండటంతో భక్తులు కొనుగోలు చేశారు. కొందరు తలనీలాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. – లక్కిరెడ్డిపల్లి
● క్షేత్రం.. తిరునాల శోభితం
సంబేపల్లె మండల పరిధి శెట్టిపల్లె గ్రామం అడవికమ్మపల్లె సమీపంలో కొలువైన శ్రీ అక్కదేవతల తిరునాల ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అక్కదేవతలతోపాటు ఆలయంలో శివలింగేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గ్రామంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి చాందినీ బండ్ల మెరవణితోపాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఉత్సవ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. – సంబేపల్లె
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment