అధికార బలంతో చెట్లు నరికివేస్తారా?
ఓబులవారిపల్లె : అధికారం ఉంది కదా తమను అడిగేవారే లేరని పచ్చటి మామిడి చెట్లను నరికి వేయడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం. జయరామయ్య అన్నారు. బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని ఎన్.పృథ్వీరాజ్ అనే రైతుకు చెందిన పది ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నరికేసిన మామిడి చెట్లను బీకేఎంయూ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జయరామయ్య మాట్లాడుతూ పృథ్వీరాజ్ అనే రైతుకు సంబంధించిన పది ఎకరాల పట్టా భూమికి కోర్టు అనుమతించినా.. తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించి మామిడి చెట్లను నరికివేశారని పేర్కొన్నారు. కూటమి నాయకులు చివరకు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని, అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేసి నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment