అసెంబ్లీ సాఽక్షిగా అప్పులపై అసత్యాలు
రాయచోటి టౌన్ : అసెంబీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కూటమి సర్కార్ నేతలు అసత్యాలతో దొరికిపోయారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం రాయచోటిలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథరెడ్డి, మున్సిపల్‌చైర్మన్ ఫయాజ్ బాషాలతో కలసి మాట్లాడారు. అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ప్రజలకు ఎన్నైనా చెప్పవచ్చన్నారు. అయితే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజల్ని తప్పదోవ పట్టిస్తూ, ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేసినా దానిని కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు, రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని బీజెపీ నాయకురాలు పురందేశ్వరీ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం తొలి అసెంబ్లీ సమావేశంలో అప్పుల నోట్ వచ్చిందన్నారు. రూ.7.80 కోట్లు ఉంటే అందులో రూ.3.5 కోట్లు గత ప్రభత్వంలోనే జరిగాయన్న వాస్తవాలను అసెంబ్లీలో ప్రజెంట్ చేశారన్నారు. అయినా కూటమి పార్టీ నేతలు దుష్ప్రచారం ఆపలేదన్నారు. రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని మాట్లాడారన్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాతపూర్వకంగా జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3.5 కోట్లు మాత్రమేనని ధ్రువీకరించిరన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుల్లో 50 శాతం అప్పులు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగాయని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుతం గద్దెనెక్కి సంవత్సరం అయినా కాలేదు అప్పుడే రూ.1.5 కోట్లు అప్పులు చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయన్నారు. జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పలు చేశారని దుష్ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాణలు చెప్పాలన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా అప్పుల బ్యాలెన్స్ షీట్ మెయింటెనెన్స్ చేస్తూనే పాలన సాగించారని తెలిపారు. చద్రబాబు నాయుడు మాత్రం అప్పుల బండారం బయట పడుతుందనే ప్రజల దృష్టి మరల్చేందుకు రకరకాలుగా పేపర్లలో అసత్యాలు రాయిస్తున్నారన్నారు.
పులివెందులలో ఎవరు చనిపాయినా..
పులివెందులలో ఎవరు చనిపోయినా దానిని వివేకానందరెడ్డి హత్యకు ముడిపెట్టడం ఏమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడున్నది మీ ప్రభుత్వమే కదా.. మీ చేతుల్లోనే సీఐడీ, ఇతర విచారణ సంస్థలు ఉన్నాయి కదా ...వాస్తవాలను ఎందుకు వెలికి తీయలేకపోతున్నారు. జగన్‌కు స్వయాన మేనమామ ఈసీ గంగిరెడ్డి చనిపోతే కూడా వివేకానందరెడ్డి హత్యకు ముడిపెడుతున్నారు. డాక్టర్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో కొన్ని నెలలు పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోతే వివేకానందరెడ్డి హత్యకు ముడి పెట్టడం సరికాదన్నారు. వాచ్‌మన్ రంగన్న అనారోగ్యంతో చనిపోతే కూడా ఎందుకు లింక్‌లు పెడుతున్నారని నిలదీశారు. ప్రజలను పక్కదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బాధ్యతారహితంగా మాట్లాడటం సిగ్గుగా అనిపించలేదా అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment