236 కేసులు నమోదు.. రూ.16.19 లక్షల రికవరీ
మార్చి 1వ తేదీ వరకు 236 కేసులు నమోదు చేసి 16.19 లక్షల రూపాయలను అపరాధ రుసుం ద్వారా వసూలు చేశాం. తూనికలు కొలతల జిల్లా ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. అలాగే ఏడాది కాటాలకు ముద్రణ ద్వారా 17.19 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తూకాలు, ధరలు, తేదీలు కొనుగోలు వస్తువుపైన రశీదు పొందే విషయాలపై వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చౌకదుకాణాలు, తోపుడుబండ్లు, బస్టాండు, చిల్లర దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, చికెన్ సెంటర్లలో ప్రజలు ఎక్కువగా మోసపోతుంటారు. ఎక్కడైనా ఎవరికై నా కొనుగోలు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే 9885217776కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే ఆ షాపుల, కేంద్రాలపైన దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. వేయింగ్ మిషన్లలో జీరో చూసిన తర్వాతనే తూనికలు, కొలతతు వేయించుకోవాలి.
– ఎం.నాగరాజు, తూనికలు కొలతల
ఇన్‌స్పెక్టర్, అన్నమయ్య జిల్లా
236 కేసులు నమోదు.. రూ.16.19 లక్షల రికవరీ
236 కేసులు నమోదు.. రూ.16.19 లక్షల రికవరీ
Comments
Please login to add a commentAdd a comment