తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి
కొనే ప్రతి వస్తువులోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత పొందడానికి వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి. గుండు సూది నుంచి విమాన ప్రయాణం వరకు కొనేవారు, ఖర్చు చేసే వారంతా వినియోగదారులే. మనం తాగే పాలు, నీరు, కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతపై ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి. వినియోగదారుడు ఎలాంటి కొనుగోళ్లు చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. కొనుగోలు చేసిన వస్తువుల్లో లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి రక్షణ పొందవచ్చు. –మేకల దర్బార్‌బాషా, జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment