
జాతీయ స్థాయి పోటీలలో విజేతలు కావడం ప్రశంసనీయం
నందలూరు : ఎన్‌ఎస్‌ఐసి–2025 జాతీయ స్థాయి పోటీలలో విజేతలుగా నిలవడం ప్రశంసనీయమని మెడల్, రివార్డ్స్ పొందిన గొబ్బిళ్ల అక్షర స్కూల్ విద్యార్థులు లక్ష్మీ చైతన్య, షేక్ జైనబ్‌లను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం అభినందించారు. గొబ్బిళ్ల అక్షర స్కూల్ చైర్మన్ గొబ్బిళ్ల త్రినాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులు డీఈఓను కలిశారు.
విద్యార్థులను ఎన్‌ఎస్‌ఐసీ మెడల్స్‌తో మరొకసారి సత్కరించారు. చైర్మన్ గొబ్బిళ్ల త్రినాథ్, కరస్పాండెంట్ గొబ్బిళ్ల శ్రీనాథ్, మెంటర్ వరప్రసాద్, పుత్తా కోటేశ్వరరావులు డీఈఓను శాలువాతో సన్మానించారు.