
నలుగురు జూదరులపై కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని మద్దయ్యగారిపల్లి సమీపంలో జూదం జోరు అధికంగా సాగుతోందని పలువురు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ హరిహర ప్రసాద్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పట్టుబడిన నలుగురు జూదరులపై కేసు నమోదు చేసి వారి వద్ద లభించిన రూ.2,910ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మద్యం విక్రయంపై కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం పంచాయతీ క్రిష్ణాపురంలో ఓ మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తోందని సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ ఇంట్లో ఉన్న 14 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహర ప్రసాద్ తెలిపారు.
బైకు ఢీకొని మహిళకు గాయాలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోదండ రామాలయం వెనుక వైపు పారిశుధ్యం పని చేస్తున్న కత్తి చిన్నక్క(55) అనే మహిళను బైకు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని 108 సాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్, అన్నమయ్య జిల్లా రైల్వేలకు అన్యాయం
రాజంపేట : రైల్వేశాఖ వైఎస్సార్, అన్నమయ్య జిల్లా రైల్వేలకు అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని గుంతకల్ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం డీఆర్‌యూసీసీ మీట్‌లో పాల్గొని మాట్లాడారు. కోవిడ్–19 ముందు ఉన్న వివిధ రైళ్లకు ఉన్న హాల్టింగ్స్‌ను ఇంతవరకు పునరుద్ధరించలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న స్టేషన్లలో కూడా రైళ్లు ఆగుతున్నాయన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లకు కనీసం తాత్కాలిక హాల్టింగ్స్ ఇవ్వమని, ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేబోర్డు, రైల్వేమంత్రిత్వ శాఖను కోరారన్నారు. నందలూరులో రైళ్లకు వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే, రైళ్లలో నీటి సమస్య తీరుతుందన్నారు. ఈ సమావేశంలో మరో సభ్యుడు తంబెళ్ల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఆర్‌యూసీసీ మీట్‌లో తల్లెం భరత్‌రెడ్డి