
ఒంటిమిట్ట రామయ్యకు పదార్థాల సమర్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా బీఎంఆర్‌జీఎఫ్ తరపున ఒంటిమిట్ట రామయ్యకు రైతులు పండించిన పదార్థాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా బుధవారం బీఎంఆర్‌జీఎఫ్ చైర్మన్ సుమతి రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పండించిన తినుబాండారాలను అధిక సంఖ్యలో ఒంటిమిట్ట రామయ్యకు సమర్పించారు. ఇవి సమర్పించే సమయంలో రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా దర్శనానికి రావడంతో ఆయనతో కలిసి స్వామి వారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేటకు చెందిన ప్రతాప్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, కడపకు చెందిన శివశంకర్‌రెడ్డి, రాచపల్లికి చెందిన మాజీ వీఎం సుబ్బారెడ్డి, మాధవరం, కడప కు చెందిన హ్యాపి కిడ్స్ పాఠశాల యాజమానులు అనిల్‌రెడ్డి, కడప, రాజంపేట లోని హరితా హోటల్ కు సంబంధించిన మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.