
●గోటితో ఒలిచిన తలంబ్రాలు అందజేత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించారు.సూపరిటెండెంట్ హనుమంతయ్య అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో వీటిని అందించారు. తలంబ్రాల కోసం మూడునెలలపాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు భక్తిభావంతో మూడు నెలలపాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.