
బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి
రాయచోటి అర్బన్ : సమాజంలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్‌లను కల్పించాలని బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం జాతీయస్థాయిలో బహుజన సమాజ్‌పార్టీ పోరాటం చేస్తోందన్నారు. కులగణన ద్వారా బీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కాగా కేంద్ర – రాష్ట్రప్రభుత్వాలు బీసీ ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మేలును చేకూర్చే కులగణన పట్ల నిర్లక్ష్య దోరణిని ప్రదర్శిస్తుండడం దారుణం అన్నారు. బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు. బడుగు, బలహీనుల అభివృద్ధికి కృషిచేసిన జ్యోతిరావుపూలే, బాబు జగ్జీవన్ రామ్, అంబేడ్కర్‌ల బాటలో బహుజన యువత నడవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్, ఉపాధ్యక్షుడు మహేష్, సెక్రటరీ నరసింహులు, జనరల్ సెక్రటరీ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది ఈశ్వర్, బహుజనవాది మల్లూరి రెడ్డిప్ర సాద్, రజకసంఘం నేతలు రమేష్‌బాబు, శ్రీనివాసులు, న్యాయవాది నాగముని, బీసీ నేతలు నరసింహాచారి, జీవానందం, జయరామయ్య, రామమోహన్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే కులగణను చేపట్టాలి
రాయచోటి అర్బన్ : పాలకులు వెంటనే కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేతలుకె.వి.రమణ,ఈ.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట బీసీ కులసమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కులగణనను చేపట్టాలన్న డిమాండ్‌తో ఆ సంఘం నేతలు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన జరపడం ద్వారా సమాజంలో ఏయే కులాల ప్రజలు ఎంత శాతం మేర ఉన్నారనేది గుర్తించవచ్చునన్నారు. తద్వారా అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు దువ్వూరు నరసింహాచారి, పల్లపు రమణ మ్మ, పాలగిరి హబీబుల్లా, వడ్డెరసంఘం నేతలు నాగముని, జీవానందం, సీనియర్ అడ్వకేట్ ఈశ్వర్, రమేష్‌బాబు, వీరబల్లి శ్రీనివాసులుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి