
ఇంటర్ ఫలితాల్లో ‘శ్రీధర్స్’ ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీధర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.ఉమామహేశ్వర్ 465, కె.నిత్యశ్రీకల్యాణి 464, వి.శ్రీకర్‌రెడ్డి 463, ఎస్.యామిని, కె.పనుష్య, పి.వాసవి, పి.మానస 462, సి.షామితారెడ్డి, పి.యశ్విత 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సి.జ్యోష్ణ 433, వీఎస్ రక్షిత 426, ఎం.దివ్య 422, సి.ధన్యత, వి.ప్రియదర్శిని 419 మార్కులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీనియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.వన్షిక, మహమ్మద్ ఇమ్రాన్ 987, పి.నిఖిలేశ్వర్ 985, ఆర్.యుక్త 984, మహమ్మద్ తాలిబ్, డి.షోషిత 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. విద్యార్థులను అభినందించారు.