
కలకడ : మదనపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెకు చెందిన ఉపాధ్యాయురాలు శారద (40) మృతి చెందారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆమె భర్త వై.వెంకటరమణ, కుమార్తె కీర్తితో కలిసి మదనపల్లెకు కారులో వెళుతుండగా సుగాలిమిట్ట వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి శారద మృతి చెందారు. ఆమె భర్త వెంకటరమణ, కుమార్తె కీర్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయ దంపతులిద్దరూ గ్రామస్తులతో సన్నిహితంగా ఉండేవారు. ఆదివారం రాత్రి శారద మృతదేహం యర్రయ్యగారిపల్లెకు చేరుకోగానే గ్రామం శోకసంద్రమైంది.
భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు