
వైద్య ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్ పద్ధతి తొలగించాలి
రాయచోటి అర్బన్ : రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నైజ్‌డ్ అటెండెన్స్ సిస్టం) పద్ధతిని తొలగించాలని పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ – 3194 రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉద్యోగుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం తీసివేయాలన్నారు. సరైన నెట్‌వర్క్ లేని కారణంగా మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న సమయంలో ఉద్యోగులు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా అటెండెన్స్‌ను నమోదు చేయలేరన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వై. శ్రీనివాసులు రెడ్డి, కార్యదర్శి మహబూబ్‌బాషా, జోనల్ ఉపాధ్యక్షుడు సుధాకర్ రాజు, జాయింట్ సెక్రటరీ రాఘవ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, లక్ష్మినారాయణతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
రాయచోటి తాలూకా కార్యవర్గం..
రాయచోటి తాలుకా యూనియన్ అధ్యక్షుడిగా సుదర్శనరాజు, ఉపాధ్యక్షురాలిగా చంద్రకళ, శివనాయక్, సదాశివరెడ్డి, శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా నూర్జహాన్, ఖదీర్, రాజేంద్ర, కోశాధికారిగా మహబూబ్‌బాషా, సెక్రటరీలుగా ప్రమీల, ధర్మారెడ్డి, రాజసులోచనలను ఎన్నుకున్నారు, ఎగ్జిక్యుటివ్ మెంబర్లుగా వెంకట్రామిరెడ్డి, వెంకటయ్య, రెడ్డెమ్మ, భాగ్యలను ఎంపిక చేశారు.