
ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు
కేవీపల్లె : ఇరువర్గాల ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా వున్నాయి. మండలంలోని తిమ్మాపురానికి చెందిన రెండు వర్గాలు సోమవారం ఇసుక విషయమై గొడవ పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ వర్గానికి చెందిన భారతి, మరో వర్గానికి చెందిన తిమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైలు కింద పడి ఒకరు మృతి
నందలూరు : నందలూరు రైల్వే కేంద్రంలో కలగట్ల సిద్ధయ్య(45) గూడ్స్ రైలు క్రింద పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్‌పి హెడ్ కానిస్టేబుల్ సుభాన్ వివరాల మేరకు.. పోరుమావిళ్ల ప్రాంతానికి చెందిన సిద్దయ్య రైలు క్రిందపడి మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించడం జరిగిందన్నారు.
ఓబులవారిపల్లెలో..
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని పున్నాటివారిపల్లి రైల్వే గేట్ సమీపంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ రైలు క్రిందపడి షేక్ అహ్మద్ వలి(40) మృతి చెందారు. ముక్కవారిపల్లి తురకపల్లి గ్రామానికి చెందిన అహ్మద్‌వలి బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు రేణిగుంట సీఆర్‌పీఎస్ ఎస్‌ఐ శివ తెలిపారు.

ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు