
గురుకుల పాఠశాల విద్యార్థులకు పతకాలు
రామాపురం : విజయవాడకు చెందిన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ విభాగంలో రామాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించారు. 30 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈనెల 5వ తేదీన ఫలితాలు ప్రకటించగా అందులో ఆరుగురు విద్యార్థులకు బంగారు పతకాలు, 8 మంది విద్యార్థుకు వెండి పతకాలు దక్కడంతో ఆర్ట్ టీచర్ ఆనందరాజును ప్రిన్సిపాల్ వి.వి. వరప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.
బీటీ కళాశాలను
యూనివర్సిటీగా ప్రకటించాలి
మదనపల్లె సిటీ : ఘన చరిత్ర కలిగిన బీటీ కళాశాలను ప్రభుత్వం యూనివర్సిటీగా ప్రకటించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. గురువారం మదనపల్లెలో విలేకర్లతో మాట్లాడారు. కాలేజీలో పూర్థిస్థాయిలో ఫ్యాకల్టీ, నాన్ టీచించ్ స్టాఫ్‌ను నియమించాలన్నారు. పీజీ కోర్సులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. మెడికల్ కాలేజీని పీపీఈ పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, జిల్లా అధ్యక్షుడు నరసింహ, కార్యదర్శి రమణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాల విద్యార్థులకు పతకాలు