
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు
కలకడ : దేవునికి చందా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఓ మహిళను అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేవులపల్లె పంచాయతీ బొజ్జగుంటపల్లె వడ్డిపల్లెకు చెందిన రమణప్రసాద్ గుడికి చందాలు వసూలు చేయగా అదే గ్రామానికి చెందిన డేరింగుల చంద్రయ్య, చంద్రయ్య భార్య లక్ష్మిదేవిలు చందా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి దుర్భాషలాడి లక్ష్మిదేవిపై దాడిచేశాడు. ఆదివారం బాధితురాలు లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
కలకడ : ద్విచక్రవాహనంను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ టౌన్‌కు చెందిన ఉమ్మర్ అతని భార్య నదియలు వారి ద్విచక్రవాహనంలో కలకడ వైపు నుంచి రాయచోటివైపు వెళుతుండగా.. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కలకడ ఇందిరమ్మ కాలనీ వద్ద పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఉమ్మర్, నదియలను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
యువకులకు గాయాలు
పెద్దతిప్పసముద్రం : పొట్టకూటి కోసం దినసరి కూలి పని కోసం వెళుతున్న ఇద్దరు యువకులను బొలేరో వాహనం ఢీ కొనడంతో గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కందుకూ రుకు చెందిన షాన్‌వాజ్ (18), జాఫర్ (21)లు పొట్టకూటి కోసం వెల్డింగ్ చేయడానికి సరిహద్దు కర్నాటక రాష్ట్రం ఊదోళ్ళపల్లికి ద్విచక్ర వాహనంలో ఆదివారం బయలు దేరారు. ఈ నేపథ్యంలో మండలంలోని కుక్కలపల్లి సమీపంలో ఓ బొలేరో వాహనం ఎదురుగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో జాఫర్‌కు స్వల్పగాయాలు కాగా షాన్‌వా జ్ అనే మరో యువకుడి కాలు విరిగింది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా బి.కొత్తకోట సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన షాన్‌వాజ్‌ను మె రుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసు పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కారుఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె : కారు ఢీకొని యువకుడు గాయపడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. మదనపల్లె పట్టణం కురవంక ప్రాంతానికి చెందిన సుధాకర్ కుమారుడు హర్ష (24) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో వెళుతుండగా విశ్వం కాలేజీ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో హర్ష గాయపడగా గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముదివేడు పోలీసులు విచారణ చేస్తున్నారు.

అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు