
నేటి నుంచి బాలికల కోసం ‘కిశోరి వికాసం’
రాయచోటి: కౌమార బాలికల సాధికారత లక్ష్యంగా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిషోరి వికాసంపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ గురువారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈనెల 2వ తేదీ నుండి జూన్ 10 వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలను కౌమార బాలికలకు అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వీటని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా కౌమార బాలికలకు విద్య ప్రాముఖ్యత, సంపూర్ణ ఆరోగ్యం, రుతు పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేద చట్టం, ఆత్మరక్షణ, యోగా, జీవనోపాధి అవకాశాలు, సైబర్, ఆన్‌లైన్ భద్రత, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
● ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం అమరావతికి రానున్న సందర్బంగా జిల్లా నుంచి 30 బస్సులలో దాదాపు 1500 మంది జిల్లా ప్రజలు తరలివెళ్తున్నారని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, పీడీడిఆర్‌డీఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి