Today Telugu Horoscope: ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు, వస్తులాభాలు | Daily Horoscope: Rasi Phalalu On April 16, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు, వస్తులాభాలు

Published Tue, Apr 16 2024 6:15 AM | Last Updated on Tue, Apr 16 2024 8:33 AM

Daily Horoscope: Rasi Phalalu On April 16 2024 In Telugu - Sakshi

మేషం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విందువినోదాలు. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం..

కర్కాటకం: గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు.  సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు..

సింహం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విద్యార్థులకు కృషి చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కన్య: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కీలక పోస్టులు.

తుల: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. దేవాలయ దర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో  లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. బంధువిరోధాలు. మానసిక అశాంతి.  వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. కళాకారులకు నిరాశ తప్పదు.

ధనుస్సు: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు.  వ్యాపారాలునత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఇబ్బందులు. అనారోగ్య సూచనలు.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపారాలలో  ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం..

మీనం: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement