
మేషం.. వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం... స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మిథునం.... ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
కర్కాటకం... కుటుంబంలో చికాకులు. ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కన్య.... కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
తుల.... సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
వృశ్చికం... కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ధనవ్యయం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు... యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
మకరం... శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం..... పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం.... మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. వృధా ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం.
Comments
Please login to add a commentAdd a comment