ఈ రాశి వారికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే.. | Horoscope Today 17 12 2023 Telugu | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..

Published Sun, Dec 17 2023 6:42 AM | Last Updated on Sun, Dec 17 2023 10:43 AM

Horoscope Today 17 12 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు  మార్గశిర మాసం, తిథి: శు.పంచమి రా.8.48 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: శ్రవణం ఉ.8.07 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.11.52 నుండి 1.20 వరకు, దుర్ముహూర్తం: ప.4.01 నుండి 4.49 వరకు, అమృతఘడియలు: రా.8.50 నుండి 10.20 వరకు, ధనుర్మాసం ప్రారంభం.

సూర్యోదయం        :  6.27
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: మీ ఆశయాలు నెరవేరే సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

వృషభం: దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ధనవ్యయం.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం.

కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

వృశ్చికం: పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. 

ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

మకరం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. ఆలయాల సందర్శనం. 

కుంభం: కుటుంబంలో చికాకులు. పనులు ముందుకు సాగవు.  ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.  

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని «విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement