శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం , తిథి: శు.నవమి ఉ.11.37 వరకు తదుపరి దశమి, నక్షత్రం: రేవతి రా.12.17 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ప.12.59 నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: ప.10.06 నుండి 10.52 వరకు, అమృత ఘడియలు: రా.10.01 నుండి 11.31 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, రాహుకాలం : ప.1.30, నుండి 3.00 వరకు, సూర్యోదయం : 6.29, సూర్యాస్తమయం: 5.26.
మేషం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యయప్రయాసలు.
వృషభం... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
మిథునం... పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి.
కర్కాటకం... ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.
సింహం... ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు.
కన్య.... పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక.
తుల..... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. దైవదర్శనాలు. విందువినోదాలు.
వృశ్చికం.... కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు.... బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా.
మకరం.... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కుంభం... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
మీనం.... ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment