శ్రీ శోభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ఏకాదశి రా.10.22 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.24 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: తె.4.43 నుండి 6.13 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు, అమృత ఘడియలు: ప.12.54 నుండి 2.24 వరకు, ప్రబోధనైకాదశి; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.12, సూర్యాస్తమయం: 5.20.
మేషం... పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు కృషి చేసినా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు.
వృషభం... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.
మిథునం.... కొత్త పనులకు శ్రీకారం. వస్తులాభాలు. విందువినోదాలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి.
కర్కాటకం... బంధువిరోధాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కళాకారులకు ఒత్తిడులు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆరోగ్యభంగం. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపించదు.
సింహం.... కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి.
కన్య.... పరపతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వస్తులాభాలు.
తుల.... దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చికం... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు... రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.కళాకారులకు నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.
మకరం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.
కుంభం... బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కుటుంబసభ్యులనుంచి ఒత్తిడులు.
మీనం... ఉద్యోగలాభం. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం.
Comments
Please login to add a commentAdd a comment