శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.7.56 వరకు, తదుపరి ద్వాదశి తె.6.21 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం: భరణి రా.10.16 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.8.23 నుండి 9.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.29 నుండి 7.58 వరకు, అమృతఘడియలు: సా.5.39 నుండి 7.12 వరకు, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి, గీతా జయంతి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.30, సూర్యాస్తమయం: 5.27.
మేషం.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
వృషభం... ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.
మిథునం... ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
కర్కాటకం.... ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
సింహం... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య.... పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
తుల... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రుల సహాయం అందుతుంది. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం... సన్నిహితులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.
ధనుస్సు.... పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మకరం.... పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత గందరగోళం. ధనవ్యయం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం.... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపుబంధువుల కలయిక. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.
మీనం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment