శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.చతుర్దశి తె.5.49 వరకు (తెల్లవారితే మంగళ వారం), తదుపరి అమావాస్య, నక్షత్రం: విశాఖ ఉ.11.38 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.3.43 నుండి 5.19 వరకు, దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.04 వరకు, తదుపరి ప.2.29 నుండి 3.17 వరకు, అమృతఘడియలు: రా.1.24 నుండి 3.04 వరకు; రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం : 6.24, సూర్యాస్తమయం : 5.23.
మేషం... వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. విద్యార్థులకు ఒత్తిడులు.
వృషభం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం.... మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయ దర్శనాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు అనుకూలం.
కర్కాటకం... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. రుణయత్నాలు. బంధువులను కలుసుకుంటారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
సింహం... పరిస్థితి అంతగా అనుకూలించదు. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు.
కన్య... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.
తుల... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తిలాభం. వృత్తి,వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.
ధనుస్సు.... శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. అంచనాలలో పొరపాట్లు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు గందరగోళం.
మకరం.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.
కుంభం... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వస్తులాభాలు.. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం.... బంధువులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు. అనారోగ్య సూచనలు.
Comments
Please login to add a commentAdd a comment