
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయవర్గాలు, కళాకారులకు అందిన అవకాశాలు నిరాశ పరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకువస్తాయి. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాలలో సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. ఉద్యోగాలలో చురుగ్గా వ్యవహరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. వారం మధ్యలో వ్యయ ప్రయాసలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆస్తి వివాదాలు పరిష్కారం. పాతబాకీలు వసూలవుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని విధంగా అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉత్సాహం, పట్టుదలతో ఎంతటి పనినైనా పూర్తి చేస్తారు. గృహం, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగుతారు. పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడుల యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి. కళాకారులు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. పనులు వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామివర్గాల అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు పొందుతారు. కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో మరింత అనుకూల సమయం. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. కళాకారులకు రెండుమూడు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు.దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల సత్తా వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు. ఉద్యోగాలలో ప్రమోషన్లు. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.