భూగర్భజలాల పెంపు అందరి బాధ్యత
బాపట్ల: భూగర్భ జలాల పెంపు అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. జలవనరులను సంరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ భవనాల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. 256 గ్రామాలలోని 261 అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని చెప్పారు. ఒక్కోదానికి రూ.16 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిబంధనలు అనుసరించి పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పి.డి. ఉమా, పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఎస్‌ఈ జి.రత్నబాబు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంజీవయ్య సేవలు చిరస్మరణీయం
బాపట్ల: దామోదరం సంజీవయ్య సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సంజీవయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప సంఘటన అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
భూగర్భజలాల పెంపు అందరి బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment