పెదకాకాని: డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. నంబూరులోని డీఎన్‌ఏ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాల పోటీల్లో వైద్యులు పాల్గొని ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో నిత్యం ఒత్తిడి, ఆందోళన ఉంటాయని, వాటిని తట్టుకునేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. పోటీల్లో బ్రిందా బ్రైయిన్ – ఎ 1 ఎవన్‌జర్స్, ఐకాన్–జీబీఆర్, టైమ్ పాస్ టిల్లు – శ్రీ టీమ్‌లు పోటీ పడ్డాయి. ఎ1 ఎవన్‌జర్స్, జీబీఆర్, శ్రీ టీమ్ విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్‌కు చేరిన శ్రీటీమ్ అమృత టీమ్‌తో పోటీపడగా శ్రీటీమ్ విజయం సాధించింది. టీమ్‌లో మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్‌గా నిమ్మకాయల పృథ్వీరాజ్, బెస్ట్ బౌలర్‌గా పృథ్వి ట్రోఫీలను అందుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీరింగ్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ జి. శివకుమార్‌రెడ్డి, డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.ఎస్. రెడ్డి, డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, వైద్యులు దావులూరి రమేష్, సందీప్ వెల్లా, దాట్ల శ్రీనివాసరెడ్డి, జాన్ షహిద్, ఎండీ. అస్లం, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment