అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారుల దాడులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై ఆదివారం మైనింగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గుంటూరు వెస్ట్ మండలం చౌడవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 104లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుపై తనిఖీలు చేశారు. పుప్పాల గోపీకృష్ణ అలియాస్ ఆడిటర్ గోపీకృష్ణ అక్రమంగా మైనింగ్‌కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. మట్టి తవ్వకాలు చేస్తున్న పొక్లెయిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నల్లపాడు పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment