టైరు పేలి కారు బోల్తా
జె.పంగులూరు: వేగంగా ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో కారు బోల్తా పడి ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని జాగర్లమూడివారిపాలెం జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై ఆదివారం జరిగింది. బి. రామసుబ్రహ్మణ్యం కుటుంబం కారులో వైజాగ్ నుంచి కడప బయలు దేరారు. జాతీయ రహదారిపై జాగర్లమూడివారిపాలెం ఫైఓవర్‌పైకి రాగానే కారు ముందు టైర్ ఒక్క సారిగా పేలింది. దీంతో కారు బోల్తా కొట్టింది. ఆ సమయంలో కారులో సుబ్రహ్మణ్యంతో పాటు అతడి భార్య వెంకటసుబ్బలక్ష్మి, కుమార్తె ఉన్నారు. ముగ్గురుకి గాయాలు కావడంతో హైవే అంబులెన్స్‌లో ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రేణింగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చీరాల రూరల్: గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చీరాల – వేటపాలెం రైల్వేస్టేషన్ మధ్య గల అరవకాలనీ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్. కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీంచించారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 9440627646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ...
బొల్లాపల్లి: మిరప కోతకు వచ్చిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మండలంలోని రావులాపురం – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగింది. బండ్లమోటు పోలీసులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని నల్లదిబ్బల పల్లెకు చెందిన పల్లపు చిన్న (25) మండలంలోని గుమ్మనంపాడు గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మిరప కాయల కోత కూలికి వచ్చాడు. తన ద్విచక్ర వాహనంపై గుమ్మనంపాడు నుంచి రాజులపాలెం వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తుతెలియని వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తల్లి పల్లపు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య స్వాతి, ఒక కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా.. రోడ్డు ప్రమాదానికి సంబంధించి యువకుడు మృతిచెందిన సంఘటన ప్రాంతంలో మండలంలో రెండు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనానికి చెందిన నంబరు ప్లేట్ పడి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టైరు పేలి కారు బోల్తా
టైరు పేలి కారు బోల్తా
Comments
Please login to add a commentAdd a comment