సత్తా చాటిన నరసరావుపేట
కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో
చాంపియన్ షిప్ పోటీల్లో విజేత
అద్దంకి రూరల్: స్థానిక గీతామందిరంలో ఆదివారం జాతీయ స్థాయి ఓపెన్ కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 6 రాష్ట్రాల నుంచి 650 మంది పాల్గొనగా.. నరసరావుపేట టీం విజయం సా ధించింది. పోటీల చీఫ్ ఆర్గనైజర్ పి.రాంబాబు మాట్లాడుతూ సొంత ఊరికి పేరు తేవాలని కోరికతోనే అద్దంకిలో నిర్వహించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సాయిరాం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చిన్ని మురళీ కృష్ణ, చిన్ని శ్రీనివాసరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, మలాది శ్రీనివాసరావు, కరాటే మాస్టర్ వెంకట రత్నం పాల్గొన్నారు.
మాలలు ఆర్థికంగా ఎదగాలి
అద్దంకి రూరల్: మాల కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలను వినియోగించుకుని మాలలంతా ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్‌న్ విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్ నియోజకవర్గ మాలమహానాడు అధ్యక్షుడు అంకం కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్‌కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా కృషి చేస్తామన్నారు. తొలుత స్థానిక బంగ్లారోడ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. గోగుల వీరాంజనేయులు, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపతోటి శాంసన్, స్వర్ణవంశీకృష్ణ పాల్గొన్నారు.
బీసీల సంక్షేమానికి
అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
తెనాలి: త్వరలో రానున్న బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో బీసీ సబ్‌ప్లాన్‌తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని, ఈ మేరకు బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గతంలో మాదిరిగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తామన్న హామీని నిలుపుకోవాలని కోరారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సత్తా చాటిన నరసరావుపేట
Comments
Please login to add a commentAdd a comment