విదేశీ అతిథులొచ్చాయి..!
పర్చూరు(చినగంజాం): పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుండటంతో క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దీవిలాంటి ప్రాంతంలో పక్షలు వేసవి విడిదిగా వచ్చి చేరుతాయి. సైబీరియా దేశానికి చెందిన ఈ పక్షులు ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చి ఐదారు నెలల పాటు ఇక్కడే ఉండి గుడ్లను పొదిగి పిల్లలను వృద్ధి చేసి తిరిగి వెళ్లి పోతుంటాయి. వలసవచ్చిన కొంగజాతి పక్షులు ఈ ప్రాంతంలో ఐదారు మాసాలు గడిపి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని సంతతితో పాటు జూలై, ఆగస్టు మాసాల్లో తమ ప్రాంతానికి తిరుగు ప్రయాణమై వెళ్లిపోతాయని వారు తెలిపారు. వీటిని చూస్తూ గ్రామస్తులు తమ గ్రామ అతిథులు మళ్లీ వచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పర్చూరు మండలం వీరన్నపాలెంలో సైబీరియా పక్షుల సందడి
విదేశీ అతిథులొచ్చాయి..!
Comments
Please login to add a commentAdd a comment