సేవాలాల్ జయంతి నిర్వహణలో ప్రభుత్వం విఫలం
యడ్లపాడు: శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీనునాయక్ విమర్శించారు. యడ్లపాడు ఎర్రకొండ సమీపన ఉన్న సుగాలీ కాలనీలో ఎస్టీ యూత్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనునాయక్ మాట్లాడుతూ తండాలో జన్మించి నిలువెల్లా సేవాగుణం నిండుకొన్న సంత్ సేవాలాల్ బ్రిటిష్ పాలకులను అడ్డుకున్న ధీశాలి అన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం క్యాజువల్ లీవ్‌గా ప్రకటించగా, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని, ఇక్కడి కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో విఫలమైందన్నారు. ముందుగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సుగాలి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బాణావతు శ్రీనునాయక్, ముడావతు బాలాజీ నాయక్, హనుమానాయక్, రమావతు శ్రీనునాయక్, అంజినాయక్, దశావతు శంకర్ నాయక్, వెంకట్‌నాయక్, శివకృష్ణ నాయక్, రావూరి దుర్గానాయక్ పాల్గొన్నారు.
ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక
రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీనునాయక్
Comments
Please login to add a commentAdd a comment