ఫుట్‌బాల్ విజేత బాపట్ల జట్టు
చీరాల రూరల్: చీరాలలోని ఎన్‌ఆర్ అండ్ పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో నాలుగు జిల్లాల జోనల్ స్థాయిలో (నల్లమల జోన్) ఆదివారం నిర్వహించిన ఫుట్‌బాల్ మీట్‌లో బాపట్ల జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో నల్లమల జోన్‌లోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల అసోసియేషన్ జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాపట్ల జిల్లా జట్ల క్రీడాకారులు వీరోచితంగా పోరాడి మూడు జట్లు క్రీడాకారులను మట్టి కరిపించి విజేతగా నిలిచారు. ఉత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అనంతపురంలో మార్చి 25 నుంచి నిర్వహించనున్న హైలీగ్ పోటీలకు పంపిస్తామని జోనల్ స్థాయి కోఆర్డినేటర్ నూతలపాటి దేవదాసు తెలిపారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిమళ్ల విజయ్‌కుమార్, కోఆర్డినేటర్ దేవదాసు, బొనిగల ప్రేమయ్య, బాలసౌరి, రమ్మికుమార్, నరేష్ పర్యవేక్షించారు. మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment