బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Mon, Feb 17 2025 1:41 AM | Last Updated on Mon, Feb 17 2025 1:40 AM

బాపట్

బాపట్ల

సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

తేజోరూపిణిగా బగళాముఖి

చందోలు(కర్లపాలెం): గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు తేజోరూపిణిగా దర్శనంఇచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మాఘ మాస అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 538.50 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 10,000 క్యూసెక్కులు విడుదలవుతోంది.

వీరుల గుడికి వీరాచారులు

కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెం పూడిలో ఉన్న పల్నాటి వీరుల గుడికి వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం వీరాచారులు తరలివచ్చారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్‌ (గులియన్‌బెరి సిండ్రోమ్‌) కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్‌లో ఆదివారం ప్రకాశం జిల్లా అలసానిపల్లెకు చెందిన బి.కమలమ్మ(45) చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీ సిండ్రోమ్‌తో ఈ నెల 3న జీజీహెచ్‌ న్యూరాలజీ వార్డులో అడ్మిట్‌ అయి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయింది. వాస్తవానికి ప్రతినెలా గుంటూరు జీజీహెచ్‌లో పది మంది నుంచి పదిహేను మంది ఈ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వారు గుంటూరు జీజీహెచ్‌కు తరలి వస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జీజీహెచ్‌లో జీబీ సిండ్రోమ్‌ కేసులకు న్యూరాలజీ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఖరీదైన ఇంజక్షన్‌లను తక్షణమే ఇస్తున్నట్లు న్యూరాలజీ వైద్యులు తెలిపారు.

భయపడాల్సిన పనిలేదు...

ఆదివారం చోటు చేసుకున్నది తొలి మరణమేమీ కాదని... గత ఏడాది కాలంలో ఈ ఆస్పత్రిలోనే నలుగురు వ్యాధి బాధితులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఖరీదైన వైద్యం అవసరమేగానీ, వ్యాధికి భయపడాల్సిన పని లేదని వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం కమలమ్మ మృతి చెందింది. కాగా, నరసరావుపేటకు చెందిన మరో మహిళ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిలో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన వారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని న్యూరాలజిస్టులు వెల్లడించారు.

నెలకు 10 నుంచి 15 కేసులు

న్యూరాలజీ వైద్య విభాగానికి ప్రతి నెల సగటున 10 నుంచి 15 జీబీ సిండ్రోమ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. ఒక్కో పేషెంట్‌కు ఖరీదైన ఇమ్యూనో గ్లోబిన్‌ ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జీజీహెచ్‌లో 115 మంది చికిత్స పొందారు. కాగా వీరిలో 66 మందికి మాత్రమే ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజక్షన్లు చేయడం ద్వారా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇతరులు సాధారణ వైద్యం ద్వారానే రికవరీ అయినట్లు న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇంజక్షన్లు అవసరం వస్తుందని తెలిపారు. ఒక్కో ఇంజక్షన్‌ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. బాధితుల్లో 20 శాతం మందికి మాత్రమే ఈ ఇంజక్షన్లు చేయాల్సి వస్తోందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో కేవలం 5 నుంచి 7.5 శాతం మంది మాత్రమే మరణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

నెల బాధితుల సంఖ్య

2024 మార్చి 16

ఏప్రిల్‌ 6

మే 11

జూన్‌ 10

జూలై 4

ఆగస్టు 3

సెప్టెంబరు 13

అక్టోబరు 17

నవంబరు 9

డిసెంబరు 10

2025 జనవరి 11

ఫిబ్రవరి 5

ఎలా వస్తుందంటే..

7

న్యూస్‌రీల్‌

పూర్వజన్మ సుకృతం

కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడెమీ మాజీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో

బాధితురాలి మృతి

ప్రతినెలా సగటున

10 నుంచి 15 మందికి చికిత్స

సత్వర వైద్యసేవలు

అందిస్తుండటమే కారణం

భయపడాల్సిన పనిలేదంటున్న

వైద్య నిపుణులు

వయస్సుతో సంబంధం లేకుండా.. ఆడ, మగ తేడా లేకుండా జీబీ సిండ్రోమ్‌ సోకుతుంది. ఇది అంటు వ్యాధి మాత్రం కాదు. 25 శాతం మందికి ఈ వ్యాధి సోకడానికి కారణాలు తెలియదు. 20 శాతం మందికి దగ్గు, జలుబు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, రిస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల సోకుతోంది. గ్యాస్ట్రో ఎంట్రైటీస్‌ (జీఈ) ఇన్‌ఫెక్షన్‌ వల్ల, డయేరియా వల్ల కూడా వస్తోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం. వ్యాధి నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలుత కాళ్లకు వ్యాధి సోకి తర్వాత శరీరం పై భాగానికి ఎగబాకుతుంది. వ్యాధి నుంచి కొంత మంది గంటల వ్యవధిలోనే కోలుకోవచ్చు. మరికొంత మందికి నెలల సమయం పడుతుంది. జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు వచ్చి తగ్గుతున్న సమయంలో వారికి కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమై కాళ్లు బలహీనపడితే దీనిని జీబీ సిండ్రోమ్‌గా గుర్తించాలి. తక్షణమే చికిత్స కోసం న్యూరాలజిస్టులను సంప్రదించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
బాపట్ల1
1/6

బాపట్ల

బాపట్ల2
2/6

బాపట్ల

బాపట్ల3
3/6

బాపట్ల

బాపట్ల4
4/6

బాపట్ల

బాపట్ల5
5/6

బాపట్ల

బాపట్ల6
6/6

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement