సూర్య భగవానునికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలియజేశారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆర్గనైజర్, కో–ఆర్డినేటర్ సుజాత, రామకృష్ణ పాల్గొన్నారు.
‘రాష్ట్ర సమ్మాన్’
పురస్కారం ప్రదానం
తెనాలి: తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో సంస్కృతి కళాక్షేత్ర ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జీపీ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో జరిగిన భారత్ ఉత్సవ్–2025లో తెనాలికి చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్ నారాయణకు ‘రాష్ట్ర సమ్మాన్’ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళా, సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరై చిన్నారిని అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని ఘనతలు సాధించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏడాదిన్నర వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న ప్రదీప్‌నారాయణ మూడేళ్ల వయసులో జాతీయ గీతాన్ని 52 సెకన్లలో ఆలపిస్తున్నాడు. పండ్లు, కూరగాయలు, మనిషి శరీర భాగాలు వంటివి 500 పైగా గుర్తిస్తున్నాడు. తెలంగాణ ‘రాష్ట్ర సమ్మాన్’ సహా ఇప్పటికి ఎనిమిది జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో పది అవార్డులు అందుకున్నాడు.
కస్టమ్స్ అధికారులు అవయవదానం
లక్ష్మీపురం: కస్టమ్స్ డే వేడుకలలో భాగంగా కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి దంపతులు అవయవదానం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన వేడులలో ఆయన మాట్లాడుతూ బాక్స్ ఆఫ్ కై న్డ్ నెస్ స్థాపకులు ఒకే రోజు 4 వేల మందితో రక్తదానం చేయించారని అభినందించారు. ప్రతిఒక్కరు సేవాభావం, మానవత్వం కలిగి ఉండాలన్నారు. తాను, తన సతీమణి అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రాంగణంలో ఉన్న కస్టమ్స్ శాఖ అధికారులు 36 మంది కూడా అవయవదానం చేస్తూ అంగీకారపత్రం ఇచ్చారు. సెప్ట్‌క్ ఛైర్‌పర్సన్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఇంతమంది అవయవదాతలుగా నమోదు కావడం సంతోషకరంగా ఉందన్నారు.
ఆకట్టుకున్న గాత్ర కచేరీ
నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కళావేదికపై విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్యాగరాజ నీరాజనం ఆదివారంతో ముగిసింది. డీవీర్ సీత గాత్ర కచేరీని త్యాగరాజ కీర్తన, నిన్నే భజన అనే కీర్తనతో ప్రారంభించారు. పలు వాగ్గేయకార కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఆమెకు వాయులీనంపై వారణాసి శ్రీకృష్ణ రాఘవ, మృదంగంపై బి.సురేష్‌బాబు వాయిద్య సహకారాన్ని అందించారు. కళాకారులను ఎం.వై.శేషురాణి, ప్రముఖ సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు, నేతి విశ్వేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు.
సూర్య భగవానునికి 241 పాత్రలతో పాయసం నివేదన
సూర్య భగవానునికి 241 పాత్రలతో పాయసం నివేదన
Comments
Please login to add a commentAdd a comment