ప్రయాణికుల నేస్తమై.. భద్రతే సమస్తమై..
ఒక్క క్షణం కన్ను మరల్చినా.. దాని పర్యవసానం మాత్రం నిండు ప్రాణాలే. కానీ స్టీరింగ్ పట్టిన మరుక్షణం వారికి ఒకటే ధ్యాస.. తనని నమ్ముకుని వెనుక ప్రయాణికులున్నారని.. వారిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉంటాయని! అలా దాదాపు 25 నుంచి 34 ఏళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసిన వారికి ఉత్తమ పురస్కారాలను అందించి ఆర్‌టీసీ ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
పట్నంబజారు: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రమాదరహిత కెరీర్ కొనసాగించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన డ్రైవర్‌లకు పురస్కారాలు అందజేశారు. గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలకు ముగ్గురు చొప్పున 15 మందికి వీటిని ప్రదానం చేశారు. వీరితోపాటు జిల్లా స్థాయిలో మరో ముగ్గురికి అత్యుత్తమ డ్రైవర్ పురస్కారాలను అందజేశారు. గుంటూరు జిల్లాలోని ఐదు డిపోలలో 345 బస్సులు ఉన్నాయి. 642 మంది డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా లక్ష మందికిపైగా ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆర్‌టీసీలో కొత్తగా నియామకాలు నిలిచిపోయాయి. వేల మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ, మెడికల్ అన్‌ఫిట్ పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉన్న డ్రైవర్లతోనే చాలాచోట్ల డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. వారికి తగిన విశ్రాంతి ఉండటం లేదు. రిటైర్డు అయిన డ్రైవర్లకు పెన్షన్ తక్కువ మొత్తంలో వస్తోంది.
పురస్కారాలు పొందిన డ్రైవర్లు వీరే...
జిల్లా స్థాయిలో ఎల్‌ఎస్ రావు, కేఎస్ రెడ్డి, బీఎస్ రెడ్డి పురస్కారాలు పొందారు. గుంటూరు 1 డిపో పరిధిలో ఆర్‌ఎన్ రావు, ఏవీ రాజు, కేవై కొండలు, గుంటూరు 2 డిపో పరిధిలో పీవీ రత్నం, జేఎల్ రెడ్డి, ఎస్ సుబ్బారావు, తెనాలి డిపో నుంచి కేవీ రెడ్డి, ఎంఎం కుమార్, బీకే అంకమ్మ, పొన్నూరు డిపోలో షేక్ జి.గౌస్, పీకే ఖాన్, జీఎస్‌ఎస్ రావు, మంగళగిరి డిపో నుంచి డి.యోహాన్, బీవీ రావు, కేఎస్‌ఎస్ రావులకు అవార్డులు అందజేశారు. వీరికి 25 నుంచి 34 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసిన రికార్డు ఉంది.
దశాబ్దాలుగా ప్రమాదరహిత
డ్రైవింగ్ చేసిన వారికి పురస్కారాలు
అందరూ ఆదర్శంగా తీసుకోవాలని
ఆర్‌టీసీ అధికారుల సూచన
Comments
Please login to add a commentAdd a comment